నాగర్ కర్నూల్: ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్థుల ఆగ్రహం.

1చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఎట్టిదర్ పల్లిలో దుందుభి వాగు నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక తరలింపును గ్రామస్థులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున వాహనాల్లో ఇసుకను తరలిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళనకు దిగి వాహనాలను నిలిపివేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రాగా, అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని బుధవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్