నాగర్ కర్నూల్ జిల్లాలో మంగళవారం సాయంత్రం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ పంటను కాపాడుకోవడానికి రైతులు వర్షంలో తడుచుకుంటూ దిక్కుతోచని స్థితిలో పడ్డారు.