నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కమతం నందిని శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె ముగ్గురు పిల్లలు అమెరికాలో స్థిరపడగా, ఆరేళ్లుగా వారితోనే ఉంటున్నారు. సర్పంచ్ స్థానాన్ని జనరల్ కు కేటాయించడంతో, ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చి ఈ పదవికి నామపత్రాలు సమర్పించారు. ఈ సంఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.