మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నర్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ హౌస్, ప్యాకేజీ–3 వద్ద తనిఖీలు నిర్వహించి, పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాజెక్టుల పర్యటన చేపట్టిన మంత్రి, ఇరిగేషన్ ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.