బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో 460 గ్రామపంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర అని అన్నారు. గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు.