ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లాలో అవగాహన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ, ఎయిడ్స్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని, ఈ వ్యాధిపై జిల్లా స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.