వెల్దండలో ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ.. నలుగురికి గాయాలు

5చూసినవారు
వెల్దండలో ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ.. నలుగురికి గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో ఆర్టీసీ బస్సు, డీసీఎం వాహనాలు ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, అదే దారిలో హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వెళ్తున్న డీసీఎంను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మేఘ, రాము, రమణ, హర్ష అనే నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, రహదారిపై ఉన్న వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.