నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంతో వనపర్తికి వెళ్తుండగా, నాగర్ కర్నూల్ మండలం, పెద్దాపూర్ గ్రామానికి చెందిన మహేష్ అనే ఆటో డ్రైవర్ బిజినేపల్లి నుంచి వట్టెం వైపు వస్తున్న క్రమంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం, ఆటో డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ ను 108 సాయంతో నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.