నాగర్‌కర్నూల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఈ నెల 2న పరీక్ష రాసి, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సూచనతో స్కానింగ్ సెంటర్‌కు వెళ్లగా, అక్కడి బాత్రూంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం, తల్లితో కలిసి ఆ పసికందును చెత్తబుట్టలో పడేసింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. KGBVలో చదువుతున్న ఈ బాలిక ఉదంతం స్థానికంగా కలకలం రేపింది.