యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే షాపులు సీజ్: కలెక్టర్

2చూసినవారు
యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే షాపులు సీజ్: కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ, జిల్లాలో వైద్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రైతులకు యూరియా పంపిణీకి 385 ప్రాంతాలను యూనిట్లుగా విభజించి, రోజుకు 4000 మెట్రిక్ టన్నుల యూరియా అందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించినా, ఇతర సరుకులు కొనాలని డిమాండ్ చేసిన దుకాణాలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్