ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ సమీపంలోని మల్లప్ప గుట్టపై వెలసిన మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణోత్సవంలో ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.