ఆర్మీ ఉద్యోగం సాధించిన యువకుడికి ఘన సన్మానం

0చూసినవారు
ఆర్మీ ఉద్యోగం సాధించిన యువకుడికి ఘన సన్మానం
నారాయణపేట మండలంలోని అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఆర్మీ ఉద్యోగం సాధించిన గొల్ల నాగప్ప/అనంతగొల్ల వెంకటేష్‌ను బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ సర్పంచ్ స్వప్న వెంకట్రాంరెడ్డి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వప్న వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ, కష్టపడి పనిచేస్తే గొప్ప విజయం సాధించవచ్చని, గ్రామంలోని యువత కూడా స్ఫూర్తి పొంది కష్టపడి పైకి రావాలని సూచించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు.

సంబంధిత పోస్ట్