
ప్రేమించిన మైనర్ బాలుడిని విషమిచ్చి చంపిన బాలిక తండ్రి
ఉత్తరప్రదేశ్లోని భదోహి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించుకున్న 15 ఏళ్ల మైనర్ బాలుడిని, బాలిక తండ్రి కిరాయి గుండాలతో కలిసి మంగళవారం రాత్రి అతి కిరాతకంగా కొట్టించి, బలవంతంగా విషమిచ్చి చంపేశాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బుధవారం రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని, బాధితుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు.




