కొండారెడ్డిపల్లి చెరువులో యువకుడి మృతదేహం

1043చూసినవారు
కొండారెడ్డిపల్లి చెరువులో యువకుడి మృతదేహం
నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువులో గడ్డం శివరాజ్ (25) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. కార్పెంటర్, రైతు అయిన శివరాజ్ గత 24 గంటలుగా కనిపించకుండా పోయాడు. మృతదేహం లభ్యమవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. యువకుడి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై నారాయణపేట పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.