నారాయణపేట జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

84చూసినవారు
నారాయణపేట జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం భూనేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. పనుల్లో వేగం పెరగాలని ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉందా? లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముదిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో 80 శాతం ఇండ్లు పూర్తి అవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్