నారాయణ పేట జిల్లా కేంద్రంలోని చేనేత సొసైటీలలో జరిగిన 51కోట్ల అక్రమ లావాదేవీలపై తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హైందవి రెడ్డి, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్, సీఐటీయు జిల్లా కార్యదర్శి బాల్ రామ్, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు కెంచె నారాయణ శనివారం నాడు హైదరాబాద్ లోని లోకాయుక్తలో పిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సుమారుగా 5వేల మంది చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు.