దామరగిద్ద మండల కేంద్రంలో బుధవారం పతాంజలి యోగ సమితి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బీమయ్య గౌడ్ తెలిపారు. హోమియోపతీ వైద్యులు మొత్తం 125 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శిబిరానికి వచ్చిన వారికి యోగపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యోగ సమితి జిల్లా జిల్లా అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.