మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అందులో భాగంగానే ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తుందని నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి అన్నారు. శుక్రవారం ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామ చెరువులో ప్రభుత్వం అందించిన ఉచిత చేప పిల్లలను వదిలిపెట్టారు. మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.