
వివాదం వేళ సంచార్ సాథీ డౌన్‌లోడ్స్‌లో బిగ్ జంప్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంచార్ సాథీ యాప్ డౌన్లోడ్స్ అనూహ్యంగా పెరిగాయి. మొబైల్ తయారీ సంస్థలకు ఈ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్‌గా ఇవ్వాలని కేంద్రం ఆదేశించడంతో పాటు, దీనిపై విపక్షాలు 'స్నూపింగ్' యాప్‌గా ఆరోపణలు చేయడంతో వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో, డాట్ వర్గాల ప్రకారం, యాప్ డౌన్లోడ్స్ రోజుకు 60 వేల నుంచి 6 లక్షలకు పెరిగాయి. ఇప్పటివరకు 1.5 కోట్ల మంది ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారు.




