మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద పారుపల్లి గ్రామానికి చెందిన రైతు లవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. భూసమస్య పరిష్కారం కోసం గత కొద్ది రోజులుగా కార్యాలయానికి వస్తున్న అతను కార్యాలయం ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.