హైదరాబాద్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగిన భూ భారతి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లాలోని ఎంపిక చేయబడ్డ రైతు వేదికలలో రైతులు ప్రత్యక్ష ప్రసారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కోస్గి మండలం చంద్రవాంఛ, గుండుమాల్, లింగాలు చేడ్, కొత్తపల్లి, మద్దూర్, దామరగిద్ద మండలం బాపన్ పల్లి, నారాయణపేట మండలం సింగారం రైతు వేదికలలో వీక్షించారు చెప్పారు.