రైతులకు ఉచిత కూరగాయల నార్లు పంపిణీ

0చూసినవారు
రైతులకు ఉచిత కూరగాయల నార్లు పంపిణీ
నారాయణపేట జిల్లా శాసనపల్లి గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూరగాయలు పండించే రైతులకు ఉచితంగా నార్లు పంపిణీ చేశారు. భారతీయ కిసాన్ సంఘం నారాయణపేట జిల్లా రాష్ట్ర జోనల్ కార్యదర్శి వేంకోబా సంగం తరఫున జాజాపురం రైతు వేదికలో ఎఫ్.పి.ఓ. సంఘం ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ నర్సరీ ద్వారా అత్యధిక దిగుబడినిచ్చే నార్లను పొలాల్లో నాటి పంట దిగుబడికి కృషి చేయాలని సూచించారు. ప్రతి ఎకరాకు ₹9600 విలువైన నారును ప్రభుత్వం నేరుగా రైతులకు అందిస్తోంది. జాజాపురం, మన్నె లక్ష్మీకాంత్, కాట్రే రాము సొసైటీల సహకారంతో, ఉద్యాన శాఖ అధికారులు సాయిబాబా, హర్షవర్ధన్ రెడ్డిల సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. శాసనపల్లి గ్రామంలో విశ్రాంత ఉపాధ్యాయుడు గణప్ప శ్రీనివాస్ కూడా రైతులకు అవగాహన కల్పించి, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్