అత్తా కోడళ్ల పరోక్ష పోరు.. పుట్టిన ఊరు పై ఆసక్తి

8చూసినవారు
అత్తా కోడళ్ల పరోక్ష పోరు.. పుట్టిన ఊరు పై ఆసక్తి
మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డి పుట్టిన ధన్వాడ గ్రామంలో రెండో విడత సర్పంచి ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీ భాజపా నుంచి, ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో, వారి మద్దతు ఉన్న పార్టీ అభ్యర్థుల గెలుపు కీలకంగా మారింది. భారాస అభ్యర్థి కూడా రంగంలో ఉండటంతో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం రెండు పార్టీలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించనున్నాయి. కాంగ్రెస్‌ మద్దతుదారు ఉదయం 11 గంటలకు, భాజపా మద్దతుదారు మధ్యాహ్నం 2 గంటలకు ర్యాలీలు జరపనున్నారు. భాజపా ర్యాలీలో ఎంపీ అరుణ పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో అత్తాకోడళ్లు పరోక్షంగా పోరాడుతుండటం ఆసక్తి రేపుతోంది.

సంబంధిత పోస్ట్