నారాయణపేట్ జిల్లా నర్వ మండలం తహసీల్దార్ మల్లారెడ్డి అధ్యక్షతన శుక్రవారం రోజున జంగంరెడ్డిపల్లి గ్రామంలో భూ సర్వే కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. గ్రామాల్లోని రైతులకు ఎటువంటి భూ సమస్యలు, వివాదాలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక భూ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తహసీల్దార్ అన్నారు, ఈ సర్వే ద్వారా భూముల హద్దులు స్పష్టమై, భవిష్యత్తులో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సర్వే అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.