మేదో వైకల్యం, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎదుర్కుంటున్న కేసులలో ఉచిత న్యాయ సేవలు అందించాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. నారాయణపేట కోర్టు మీటింగ్ హాలులో ఎల్ ఎస్ యు ఏం ప్యానెల్ కమిటీ సభ్యులకు, న్యాయవాదులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జడ్జీలు న్యాయవాదులు పాల్గొన్నారు.