ఎద్దుల బండి పై నిమజ్జనానికి తరలిన గణనాథుడు

2చూసినవారు
ఎద్దుల బండి పై నిమజ్జనానికి తరలిన గణనాథుడు
డీజే ల హోరుతో, డిస్కో లైట్ వెలుగులతో అట్టాహసంగా వినాయక నిమజ్జనాలు చేస్తున్న ఈ కాలంలో నారాయణపేట జిల్లా మక్తల్ మండలం దాసర్ దొడ్డి గ్రామస్తులు సాంప్రదాయ నిమజ్జనానికి పెద్ద పీట వేశారు. గ్రామంలో ప్రతిష్టించిన విజ్ఞ వినాయకుడిని అత్యంత సంప్రదాయబద్ధంగా ఎద్దుల బండి పై కూర్చోబెట్టి అందంగా అలంకరించి చిన్నారుల డప్పు చప్పుళ్ళ మోతతో గంగమ్మ ఒడికి సాగనంపారు. వారు మాట్లాడుతూ ఎన్ని ఆధునిక పోకడలు పోయినా సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం చేయడం ఆనందకరమైన విషయమని తెలిపారు.

సంబంధిత పోస్ట్