నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా, సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ముందుగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుని, పుష్కరిణి కోనేటి పవిత్ర జలాలతో శుద్ధి చేసుకుని ఆలయ దర్శనం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.