మక్తల్ నియోజకవర్గం ఆత్మకూర్ మండలం కేశవ్ నగర్ గ్రామానికి చెందిన ఆలంపురి శ్రీసుధ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 5 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసిని మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం మంజూరు చేసి, బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. దీనిపై కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.