శనివారం సాయంత్రం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ మండలం నాగిరెడ్డిపల్లి శివారులో ట్రాక్టర్ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు కుమ్మరి బాలప్ప మృతి చెందారు. పని ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం మృతుడి భార్య సంధ్య రాణి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.