మక్తల్: మంత్రి బిడి టీం వాహనం బోల్తా.. నలుగురికి గాయాలు

3చూసినవారు
మక్తల్: మంత్రి బిడి టీం వాహనం బోల్తా.. నలుగురికి గాయాలు
మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి గేటు దగ్గర బుధవారం, మంత్రి వాకిటి శ్రీహరి కాన్వాయ్‌లో వెళ్తున్న బాంబ్ స్క్వాడ్ వాహనం బోల్తా పడింది. ఉట్కూరు మండలం మల్లెపల్లి గ్రామంలో జరిగే కార్యక్రమానికి మంత్రి వెళ్తుండగా, ఎస్కార్ట్ వాహనాల వెనుక వస్తున్న బాంబ్ స్క్వాడ్ వాహనం ఒక టూ వీలర్ బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు కింద పడిపోయింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్