మక్తల్ నియోజకవర్గం అమరచింత మండలోని సింగంపేటలో నూతనంగా నిర్మించిన అంగన్ వాడి కేంద్ర భవనాన్ని ఆదివారం రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడిలో పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టిగా ఆహారం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత సంఘం చైర్మన్ నాగరాజ్ గౌడ్ పాల్గొన్నారు.