మక్తల్ నియోజకవర్గం మాగనూర్ మండల కేంద్రం నుండి అచ్చంపేటకు బీటీ రోడ్డుకు శనివారం మంత్రి డా. వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 3 కోట్ల 80లక్షలతో నూతనంగా బీటీ రొడ్డును నిర్మిస్తున్నామని అన్నారు. వడ్వాట్ మీదుగా అడవిసత్యారం, మాగనూర్ నుండి వర్కూర్ మీదుగా నేరడగంకు వెళ్ళే రోడ్లను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి గ్రామానికి రోడ్డు ఉండేలా చొరవ తీసుకుంటామని అన్నారు.