ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ లో ట్రైబల్ కెనాన్ స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలు జరిగాయి. ఈ పోటీలలో 10 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు శుక్రవారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ బహుమతులు అందజేశారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉన్నారని, సిరాజ్, నికితా జరీన్ల ప్రతిభను గుర్తించి డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. 2036 ఒలంపిక్స్ లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామాల్లోని క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు.