మక్తల్: ప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి: మంత్రి శ్రీహరి

మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. బుధవారం నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని మల్లేపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై వంతెన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. 210 కోట్లతో నారాయణపేట - మక్తల్ మధ్య 4 లేన్ల రహదారి పనులు, సాంకేతికతతో వంతెన నిర్మాణం చేపడతామని మంత్రి వెల్లడించారు. గతంలో ఎన్నికల సమయంలో మాత్రమే పనులు జరిగేవని, ఇప్పుడు నిరంతరం సమస్యలు పరిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
