మక్తల్: ఎట్టకేళ్లకు యూరియా సరఫరా

1161చూసినవారు
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండల కేంద్రంలో శనివారం, 4 ఏళ్ల తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేపట్టారు. సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు చేసిన పోరాటం ఫలించింది. ఆగ్రోస్ సేవ కేంద్రంతో పాటు PACS ద్వారా యూరియా పంపిణీతో రైతులకు ఊరట లభించింది. వర్షాన్ని లెక్కచేయకుండా రైతులు యూరియా కోసం టోకెన్లతో క్యూలో నిలబడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్