2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం నారాయణపేట జిల్లా మక్తల్ కు చెందిన డాక్టర్ కోట్ల హనుమంతరావుకు దక్కింది. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసి, రంగస్థల కళల్లో పీహెచీ పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పురస్కారాన్ని ఈ నెల 2న (శుక్రవారం) హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రదానం చేయనున్నారు.