మక్తల్: సెల్ఫీ దిగుదామని భర్తను నదిలోకి తోసిన భార్య

78చూసినవారు
సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను కృష్ణ నదిలోకి తోసిన ఘటన శనివారం నారాయణపేట జిల్లా సరిహద్దులో జరిగింది. వివరాల ప్రకారం. రాయచూరు జిల్లా శక్తినగర్ మండలం కాడ్లూరుకు చెందిన తాతప్పను అతడి భార్య మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం సరిహద్దులో కృష్ణ నదీ ఒడ్డుకు తీసుకెళ్లింది. సెల్ఫీ దిగుదామని చెప్పి నీళ్లలోకి తోసేసింది. స్థానికులు గమనించి తాడు సహాయంతో బయటకు లాగారు. తనను హత్య చేయాలని ప్రయత్నించిందని భర్త ఆరోపించాడు.

సంబంధిత పోస్ట్