నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రమంచ గ్రామంలో గురువారం నవ వధువు శ్రీలత ఆత్మహత్య చేసుకున్న ఘటనలో, పోలీసులు సరిగా స్పందించడం లేదని ఆగ్రహించిన ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు కొడంగల్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, తమ బిడ్డకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్పీ, కలెక్టర్ వచ్చి న్యాయం చేసే వరకు తమ ఆందోళన విరమించేది లేదని రోడ్డుపై భీష్మించి కూర్చున్నారు.