మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని తెలిపారు. బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తీసుకురావాలని, జిల్లాను బాగు చేసుకోవడానికి ఈ ఏడాది మాత్రమే అవకాశం ఉందని ఆయన అన్నారు.