నారాయణపేట: ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్

51చూసినవారు
నారాయణపేట: ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రి భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరును తనిఖీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్