నారాయణపేట: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

81చూసినవారు
నారాయణపేట: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నారాయణపేట జిల్లా కోటకొండ లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీ చాలా తక్కువ ఉండటం గమనించిన కలెక్టర్ డాక్టర్ ను వివరణ కోరారు. అనంతరం బ్రాహ్మణ వాడలో శీలం రాజేశ్వరి అనే లబ్ధిదారు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. గ్రామానికి మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరు అయ్యాయని.? ఎన్ని పునాది, లెంటల్, స్లాబ్ స్థాయిలో ఉన్నాయని ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్