సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో డయల్ 100 సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. డయల్ 100 సేవల నిర్వహణపై బుధవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బ్లూ కొట్స్, పెట్రో కార్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. డయల్ 100 కాల్స్ పై నిర్లక్ష్యం చూపరాదని, తక్షణ స్పందించి బాధితులకు సహాయం చేయాలని చెప్పారు. డిఎస్పీ పాల్గొన్నారు.