నారాయణపేట: డీజిల్ కొరత... రైతులకు తప్పని తిప్పలు

2చూసినవారు
నారాయణపేట జిల్లాలో తొలకరి వానలతో వ్యవసాయ పనులు ఊపందుకుంటున్నాయి. అయితే, డీజిల్ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం నారాయణపేట రూరల్ మండలంలోని సింగారం చౌరస్తాలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కోసం రైతులు భారీగా బారులు తీరారు. పొలాలు దున్నే సమయంలో ఈ కొరత ఏర్పడటంతో పనులు ఆలస్యమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బాలతో బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పడిగాపులు పడుతున్నారు.

ట్యాగ్స్ :