నారాయణపేట: దళారుల చేతిలో నష్టపోతున్న రైతులు, వినియోగదారులు

71చూసినవారు
నారాయణపేట: దళారుల చేతిలో నష్టపోతున్న రైతులు, వినియోగదారులు
నారాయణపేట రైతు బజారులో దళారులు పాగా వేసి కూరగాయలు అధిక ధరలకు అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు. రైతులు తాము పండించిన కూరగాయలను అమ్మేందుకు అధికారులు రైతు బజార్ ను నిర్మించారు. కాగా దళారులు, పెద్ద వ్యాపారస్తులు రైతుల వద్ద నుండి బలవంతంగా తక్కువ ధరకు కూరగాయలు కొని అధిక ధరలకు విక్రయిస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక రైతులతో పాటు తాము నష్టపోతున్నామని ప్రజలు అంటున్నారు.

సంబంధిత పోస్ట్