నారాయణపేట: ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

73చూసినవారు
నారాయణపేట: ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
ఎవరి మతాలకు సంబంధించిన వారు తమ పండుగలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం నారాయణపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో మస్జిద్ ల ఇమామ్ లతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం హోలీ పండుగ ఉండటంతో ఎలాంటి ఘటనలు జరగకుండా పలు సూచనలు, సలహాలు చేశారు. సంయమనంతో పండుగలు జరుపుకోవాలని సూచించారు. ప్రార్థనల సమయంలో ఏవైనా ఘటనలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్