నారాయణపేట: ధాన్యం బస్తాలను వెంటనే మిల్లలకు తరలించాలి: కలెక్టర్

1చూసినవారు
నారాయణపేట: ధాన్యం బస్తాలను వెంటనే మిల్లలకు తరలించాలి: కలెక్టర్
నారాయణపేట జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక బుధవారం మద్దూరు మండలం దమగ్నాపూర్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి ధాన్యం బస్తాలు తడిసిపోయాయా అని అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని కొత్త బస్తాలలోకి మార్చి వెంటనే లారీల్లో లోడ్ చేయించి మిల్లులకు తరలించాలని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులును ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మూడు లారీలను ఏర్పాటు చేసి గురువారం సాయంత్రం లోపు ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you