నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ముంపునకు గురయ్యే ఆలయాలు, స్మశాన వాటికల వివరాలను లిఖితపూర్వకంగా అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం ఊట్కూరులో నిర్వహించిన పునరావాస గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టు నిర్మాణానికి ముందే నష్టాన్ని అంచనా వేసి, ప్రభావిత ప్రాంతాలను గుర్తిస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.