నారాయణపేట: వడదెబ్బతో వ్యక్తి మృతి

0చూసినవారు
నారాయణపేట: వడదెబ్బతో వ్యక్తి మృతి
నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వడదెబ్బతో నీరటి చంద్రయ్య (48) అనే వ్యక్తి మృతి చెందాడు. ధన్వాడ మండలానికి చెందిన చంద్రయ్య అప్పక్పల్లి గ్రామ శివారులో అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, తీవ్ర ఎండల ప్రభావంతో వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్ఐ సతీష్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్