నారాయణపేట: 25 ఏళ్లకు కలుసుకున్నారు

61చూసినవారు
నారాయణపేట: 25 ఏళ్లకు కలుసుకున్నారు
నారాయణపేట పట్టణంలోని డివిఎం పాఠశాలలో చదువుకున్న 2000-21 పదవ తరగతి పూర్వ విద్యార్థులు శనివారం ఇదే పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. అప్పటి తీపి జ్ఞాపకాలను, చిలిపి చేష్టలను గుర్తు చేసుకున్నారు. కుటుంబాల వివరాలు, చేస్తున్న వృత్తుల గురించి ఒకరిని ఒకరు అడిగి తెలుసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. 25 ఏళ్ల తరువాత కలుసుకోవడం ఆనందంగా వుందని అన్నారు.

సంబంధిత పోస్ట్