నారాయణపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మిషన్ వాత్సల్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీహెచ్. ప్రియాంక మాట్లాడుతూ, సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు దేశంలో అత్యున్నత పదవులు పొందారని, విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె సూచించారు.